
వైఎస్ జగన్ నమ్మకాన్ని నిలబెడతా: ద్వారకానాథ్
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నమ్మకాన్ని నిలబెడతానని పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి తెలిపారు.
తిరుపతి : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నమ్మకాన్ని నిలబెడతానని పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి తెలిపారు. పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి తంబళ్లపల్లె పార్టీ సమన్వయకర్తగా నియమితులైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ జగన్ తనపై నమ్మకంతో ఈ బాధ్యతలు అప్పగించారన్నారు. పార్టీ బలోపేతమే తన థ్యేయమన్నారు. కార్యకర్తలను కలుపుకుని పార్టీని ముందుకు తీసుకు వెళతానని ద్వారకానాథ్ పేర్కొన్నారు.
ఎప్పుడు ఎన్నికలు జరిగినా తంబళ్లపల్లెలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే విజయం అని ధీమా వ్యక్తం చేశారు. కాగా వైఎస్ఆర్ సీపీ తంబళ్లపల్లె నియోజకవర్గ సమన్వయ కర్తగా పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డిని నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం నిన్న సాయంత్రం ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది.