
పీసీసీ అధ్యక్షుడు రఘువీరా మౌనదీక్ష
రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి గురువారం అనంతపురంలోని మహాత్మాగాంధీ
అనంతపురం సెంట్రల్: రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి గురువారం అనంతపురంలోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద నోటికి నల్లరిబ్బన్ కట్టుకొని మౌనదీక్ష చేపట్టారు. అంతకు ముందు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జాతీయ జెండా ఎగురవేశారు. అక్కడి నుంచి సప్తగిరి సర్కిల్, సుభాష్‌రోడ్డు మీదుగా టవర్‌క్లాక్ వద్ద ఉన్న గాంధీజీ విగ్రహం వరకూ ర్యాలీ నిర్వహించారు.