
జేబు సంస్థల కోసమే స్విస్ చాలెంజ్..
తెలుగుదేశం పార్టీ జేబు సంస్థలకు దోచిపెట్టేందుకే స్విస్ చాలెంజ్ విధానంలో రాజధాని నిర్మాణం చేపట్టబోతున్నారని సీఎం చంద్రబాబుపై వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కె. పార్థసారథి ధ్వజమెత్తారు.
వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పార్థసారథి
విజయవాడ (గాంధీనగర్): తెలుగుదేశం పార్టీ జేబు సంస్థలకు దోచిపెట్టేందుకే స్విస్ చాలెంజ్ విధానంలో రాజధాని నిర్మాణం చేపట్టబోతున్నారని సీఎం చంద్రబాబుపై వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కె. పార్థసారథి ధ్వజమెత్తారు. విజయవాడలోని జిల్లా పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘రాజధాని నిర్మాణం ఒక సువర్ణావకాశంగా చంద్రబాబు భావించడం లేదు.
కేవలం లక్షల కోట్లు దోచుకోవడం కోసం, తన మునిమనవడి వరకు కావల్సిన డబ్బు సమకూర్చుకోవడం, తన పార్టీ నేతలఅక్రమ సంపాదనే లక్ష్యంగా రాజధాని నిర్మాణం చేపడుతున్నట్లు కనబడుతోంది’ అని పార్థసారథి విమర్శించారు. ఈ విధానంలో పారదర్శకత లేదని కేంద్ర ప్రభుత్వం నియమించిన కేల్కర్ కమిటీ తేల్చిచెప్పిందన్నారు, అయినా ఎందుకు అనుసరిస్తున్నారో చెప్పాలన్నారు.