accident
ఒంగోలు క్రైం : రోడ్డు ప్రమాదంలో ఒకరు దుర్మరణం పాలవగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన కర్నూలు రోడ్డుపై ఒంగోలు–పేర్నమిట్ట మధ్య పాలకేంద్రం వద్ద శుక్రవారం చోటుచేసుకుంది.
-మరొకరికి తీవ్రగాయాలు
ఒంగోలు క్రైం : రోడ్డు ప్రమాదంలో ఒకరు దుర్మరణం పాలవగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన కర్నూలు రోడ్డుపై ఒంగోలు–పేర్నమిట్ట మధ్య పాలకేంద్రం వద్ద శుక్రవారం చోటుచేసుకుంది. మోటారు సైకిల్‌ను టిప్పర్ ఢీకొన్న ఈ ప్రమాదంలో మోటారు సైకిల్‌పై ప్రయాణిస్తున్న కురిచేడు మండలం బయ్యవరం గ్రామానికి చెందిన మాలెపాటి మహేష్ (26) అక్కడికక్కడే మృతిచెందగా, బొల్లేపల్లి శేఖర్‌కు తీవ్రగాయాలయ్యాయి. శేఖర్‌ను చికిత్స నిమిత్తం ఒంగోలులోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. వీరిద్దరూ ఎస్సీ, ఎస్టీ కేసుకు సంబంధించిన వాయిదాకు ఒంగోలులోని కోర్టుకు హాజరవుతుండగా ప్రమాదం జరిగింది. వీరితో పాటు మరో ఆరుగురు ఇదే కేసు వాయిదా కోసం ఆటోలో ఒంగోలు వచ్చారు. ప్రమాదం విషయం తెలుసుకున్న మిగతావారంతా కన్నీరుమున్నీరయ్యారు. సమాచారం అందుకున్న ఒంగోలు తాలూకా పోలీస్‌స్టేషన్ హెడ్‌కానిస్టేబుల్ పెయ్యల రమేష్‌బాబు సిబ్బందితో సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని రిమ్స్‌కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రమేష్‌బాబు తెలిపారు.
వివాహమైన మూడు నెలలకే మృతి...
కురిచేడు: కోర్టుకు హాజరవుతూ టిప్పర్ ఢీకొని మరణించిన మాలెపాటి మహేష్‌కు వివాహమై మూడు నెలలే గడిచింది. కాళ్ల పారాణి ఆరకముందే భర్త మరణించడంతో భార్యతో పాటు ఎదిగిన కుమారుని మృతి తో తల్లిదండ్రులు, చెల్లెలు విలవిల్లాడారు. ఒక్కగానొక్క కుమారుడు రోడ్డుప్రమాదంలో దుర్మరణం పాలవడంతో వారంతా తీవ్ర విషాదంలో మునిగిపోయారు.