జనగామ జిల్లా సాధన కోసం ఈ నెల 20న పట్టణంలో జనగర్జన బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు జేఏసీ చైర్మన్ ఆరుట్ల దశమంతరెడ్డి తెలిపారు. పట్టణంలోని అంబేడ్కర్–పూలే అధ్యయన కేంద్రంలో శనివారం జరిగిన అత్యవసరసమావేశంలో వరంగల్ జేఏసీ కన్వీనర్ జయాకర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఆయనతో కలిసి దశమంతరెడ్డి మాట్లాడుతూ జనగామ జిల్లా ఆకాంక్షను సీఎం కేసీఆర్‌కు తెలిసేలా బహిరంగ సభను నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
20న జనగామలో జనగర్జన
Sep 11 2016 12:11 AM | Updated on Sep 4 2017 12:58 PM
జనగామ : జనగామ జిల్లా సాధన కోసం ఈ నెల 20న పట్టణంలో జనగర్జన బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు జేఏసీ చైర్మన్ ఆరుట్ల దశమంతరెడ్డి తెలిపారు. పట్టణంలోని అంబేడ్కర్–పూలే అధ్యయన కేంద్రంలో శనివారం జరిగిన అత్యవసరసమావేశంలో వరంగల్ జేఏసీ కన్వీనర్ జయాకర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఆయనతో కలిసి దశమంతరెడ్డి మాట్లాడుతూ జనగామ జిల్లా ఆకాంక్షను సీఎం కేసీఆర్‌కు తెలిసేలా బహిరంగ సభను నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
12న పట్టణం, మండలాలు, గ్రామాల్లో జనగామ జిల్లా చైతన్య యాత్రలు, 14న మానవ హారా లు, 16న జనగామ నుంచి పది మండలాలను కలిపేలా 500 ద్విచక్రవాహనాలతో భారీ ర్యాలీ నిర్వహిస్తామన్నారు. ఇదే సమయంలో మండల కేంద్రాలు, గ్రామాల్లోని నాయకులు ప్రజల నుంచి జిల్లా అభిప్రాయాలను సేకరించి, బైక్ ర్యాలీగా వచ్చే ప్రతినిధులకు అప్పగించాలని సూచిం చారు.
20నజరిగే జనగర్జన బహిరంగ సభ ను విజయవంతం చేసేందుకు ముందస్తు ప్రచారంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. బైక్‌ర్యాలీ రాత్రి నెల్లుట్లలో ముగుస్తుందన్నారు. జనగామ జిల్లాకు వరంగల్ ప్రజలు అండగా ఉంటారని జయాకర్ హామీ ఇచ్చారన్నారు. మంగళ్లపల్లి రాజు, డాక్టర్ రాజమౌళి, డాక్టర్ లక్ష్మినారాయణ నాయక్, మేడ శ్రీనివాస్, శ్రీనివాస్, వేణు, సతీష్, రాజు, ఉపేందర్‌రెడ్డి, మాజీద్, పిట్టల సురేష్, కొండ కిరణ్, శ్రీను తదితరులు ఉన్నారు.
Advertisement
Advertisement