పలు దొంగతనం కేసుల్లో నిందితుడిగా ఉంటూ తప్పించుకు తిరుగుతున్న ఓ పాత నేరస్థుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
పలు దొంగతనం కేసుల్లో నిందితుడిగా ఉంటూ తప్పించుకు తిరుగుతున్న ఓ పాత నేరస్థుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి 20 తులాల బంగారు ఆభరణాలతో పాటు రూ. 2వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. కరీంనగర్ జిల్లా జగిత్యాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ రాజేంద్రప్రసాద్ వివరాలు వెల్లడించారు.