విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించాలి | officially deliverance Day | Sakshi
Sakshi News home page

విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించాలి

Jul 24 2016 5:09 PM | Updated on Mar 29 2019 9:31 PM

విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించాలి - Sakshi

విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించాలి

తెలంగాణ విమోచనదినాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని బీజేపీ రాష్ర్ట కార్యవర్గసభ్యుడు కంజర్ల ప్రకాశ్ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు.

బీజేపీ రాష్ర్ట కార్యవర్గసభ్యుడు కంజర్ల ప్రకాశ్
షాబాద్‌: తెలంగాణ విమోచనదినాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని బీజేపీ రాష్ర్ట కార్యవర్గసభ్యుడు కంజర్ల ప్రకాశ్ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. అనంతరం బీజేపీ మండల ప్రధాన కార్యదర్శిగా నరేందర్‌రెడ్డి, బీజేవైఎం మండల అధ్యక్షుడిగా వెంకటేష్‌ను నియమిస్తూ నియామకపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సెప్టెంబర్‌ 17న రాష్ర్ట ప్రభుత్వం అధికారికంగా తెలంగాణ విమోచన దినాన్ని నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. గ్రామాల్లో పార్టీని బలోపేతం చేసేందుకు కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలని సూచించారు. కేంద్రం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను   ప్రజల్లోకి తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు.  కిసాన్‌ రైతు సంఘం చేవెళ్ల నియోజకవర్గ అధ్యక్షుడు కాల్వ రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ... జిల్లాలో పార్టీని తిరుగులేని శక్తిగా ఎదిగేందుకు కృషి చేస్తామన్నారు.  సమావేశంలో పార్టీ చేవెళ్ల అసెంబ్లీ కన్వీనర్‌ జంగారెడ్డి, మండల అధ్యక్షుడు శ్రీధర్‌రెడ్డి, బీజేవైఎం జిల్లా కార్యదర్శి రాము, నాయకులు వెంకట్‌రెడ్డి, శ్రీరామ్‌, శ్రీశైలం, సురేష్‌గౌడ్‌, ఆనంద్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement