
అందుబాటు ధరల్లో ఆర్ట్
ఆర్ట్‌పీస్ అనగానే అత్యంత ఖరీదైనవి మాత్రమేనని నిరాశపడే కళాభిమానులకు కొదవలేదు.
సాక్షి, వీకెండ్ ప్రతినిధి: ఆర్ట్‌పీస్ అనగానే అత్యంత ఖరీదైనవి మాత్రమేనని నిరాశపడే కళాభిమానులకు కొదవలేదు. ఈ నేపథ్యంలో చిత్రాలను అందరికీ అందుబాటులో ఉంచాలనే ఉద్దేశంతో బంజారాహిల్స్‌లోని గ్యాలరీ స్పేస్‌లో శనివారం ‘అఫర్డబుల్ ఆర్ట్’ షో ప్రారంభించారు. ప్రసిద్ధ చిత్రకారులు లక్ష్మాగౌడ్, ఏలె లక్ష్మణ్, జేఎంఎస్ మణి, రమేశ్ గుర్జాల, ఆనంద్ పంచాల్ తదితరుల చిత్రాలను అందుబాటులో ఉంచిన్నట్లు గ్యాలరీ స్పేస్ డైరెక్టర్ టి.హనుమంతరావు తెలిపారు. ప్రదర్శన ఈ నెలాఖరు వరకు కొనసాగుతుంది.