ఉద్యోగుల సమస్యలపై పోరాడుతాం | ntpctunion meeting | Sakshi
Sakshi News home page

ఉద్యోగుల సమస్యలపై పోరాడుతాం

Aug 27 2016 5:33 PM | Updated on Sep 4 2017 11:10 AM

ఎన్టీపీసీ రామగుండం సంస్థలో పని చేస్తున్న ఉద్యోగుల సమస్యలపై ఎన్టీపీసీ తెలంగాణ కార్మిక సంఘం నిరంతరం పోరాడుతుందని యూనియన్‌ ప్రధాన కార్యదర్శి కె.శ్రీపతిరావు అన్నారు. ఎన్టీపీసీ రామగుండం ఎఫ్‌సీఐ క్రాస్‌ రోడ్‌ శ్వేత హాల్‌లో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొని ఎన్టీపీసీ రామగుండం ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి యూనియన్‌ను స్థాపించినట్లు స్పష్టం చేశారు.

  • ఎన్టీపీసీ తెలంగాణ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి శ్రీపతిరావు
  • జ్యోతినగర్‌ : ఎన్టీపీసీ రామగుండం సంస్థలో పని చేస్తున్న ఉద్యోగుల సమస్యలపై ఎన్టీపీసీ తెలంగాణ కార్మిక సంఘం నిరంతరం పోరాడుతుందని యూనియన్‌ ప్రధాన కార్యదర్శి కె.శ్రీపతిరావు అన్నారు. ఎన్టీపీసీ రామగుండం ఎఫ్‌సీఐ క్రాస్‌ రోడ్‌ శ్వేత హాల్‌లో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొని ఎన్టీపీసీ రామగుండం ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి యూనియన్‌ను స్థాపించినట్లు స్పష్టం చేశారు. సెప్టెంబర్‌ 13న జరుగనున్న ఉద్యోగ గుర్తింపు సంఘం ఎన్నికలలో నామినేషన్‌ వేసిన సమయం నుంచి అనునిత్యం కొందరు భయభ్రాంతులకు గురిచేస్తూ పోటీ నుంచి తప్పుకోవాలని బెదిరిస్తున్నారని తెలిపారు. యూనియన్‌ నియమాలను విస్మరించిన కె.సారయ్య, పి.గోపాల్‌రెడ్డి, కె.తిరుపతి, ఎస్‌.శంకర్, రాజిరెడ్డిని యూనియన్‌ నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించారు. టీఆర్‌ఎస్‌ 48వ డివిజన్‌ అధ్యక్ష పదవికి రాజీనామా చేసినట్లు తెలిపారు. యూనియన్‌కు పార్టీకి ఎలాంటి సంబంధం లేదని తేల్చిచెప్పారు. కొంతమంది పనిగట్టుకుని అసత్య ప్రచారాలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. స్థానిక ప్రజాప్రతినిధి సైతం పోటీ నుంచి తప్పుకోవాలని అడిగారని చెప్పారు. హెచ్‌ఎంఎస్‌ నాయకులు సీహెచ్‌. ఉపేందర్‌ ఇబ్బంది పెడుతున్నారని యాజమాన్యానికి ఫిర్యాదు చేసినట్లు వివరించారు. ప్రస్తుతం ఎన్టీపీసీ తెలంగాణ కార్మిక సంఘం స్వతంత్ర యూనియన్‌గా పోటీలో ఉందన్నారు. సమావేశంలో శ్యాంరావు, శ్రీనివాసరావు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement