కమ్యూనిస్టులను విమర్శించే స్థాయి లేదు | Not to criticize the level of communists | Sakshi
Sakshi News home page

కమ్యూనిస్టులను విమర్శించే స్థాయి లేదు

Nov 14 2016 2:42 AM | Updated on Aug 13 2018 8:12 PM

కమ్యూనిస్టులను విమర్శించే స్థాయి లేదు - Sakshi

కమ్యూనిస్టులను విమర్శించే స్థాయి లేదు

కమ్యూనిస్టులను విమర్శించే స్థారుు కేసీఆర్‌కు లేదని, ఆయన పుట్టక ముందే తెలంగాణ ఆకాం క్ష ఉందని సీపీఎం రాష్ర్ట కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు.

కేసీఆర్‌పై తమ్మినేని ధ్వజం

 వికారాబాద్ టౌన్: కమ్యూనిస్టులను విమర్శించే స్థారుు కేసీఆర్‌కు లేదని, ఆయన పుట్టక ముందే తెలంగాణ ఆకాం క్ష ఉందని సీపీఎం రాష్ర్ట కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఆ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన మహాజన పాద యాత్ర వికారాబాద్‌కు చేరుకుంది. మాజీ మంత్రి గడ్డం ప్రసాద్‌కుమార్, తెలుగు యువత రాష్ర్ట అధ్యక్షుడు వీరేందర్‌గౌడ్, హక్కుల నేత ప్రొఫెసర్ హరగోపాల్ యాత్రకు మద్దతు పలికారు. తమ్మినేని మాట్లాడుతూ.. నిజాం పాలకులకు వ్యతిరేకంగా పోరాడింది కమ్యూనిస్టులేనన్నారు. 10 లక్షల ఎకరాలను ప్రజలకు పంచిన చరిత్ర తమ పార్టీకి ఉందన్నారు.

ఇందుకోసం 4 వేల మంది కమ్యూనిస్టులు ప్రాణాలర్పించారని స్పష్టంచేశారు. 700 కిలోమీటర్లు సాగిన తమ యాత్రలో అన్ని గ్రామాల్లోనూ సమస్యలు తాండవిస్తున్నాయని తెలిపారు. పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ సీఎంకు లేఖ రాశారు. మాజీ మంత్రి ప్రసాద్‌కుమార్ మాట్లాడుతూ.. మోదీ తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతో పేద ప్రజలే ఇబ్బందులు పడుతున్నారన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement