చారిత్రక నగరాన్ని విడదీయొద్దు | Not divied historic city | Sakshi
Sakshi News home page

చారిత్రక నగరాన్ని విడదీయొద్దు

Aug 27 2016 11:49 PM | Updated on Mar 29 2019 6:00 PM

చారిత్రక నగరాన్ని విడదీయొద్దు - Sakshi

చారిత్రక నగరాన్ని విడదీయొద్దు

చారిత్రక నగరాన్ని విడదీ యకుండా వరంగల్‌ జిల్లాను మూడు జిల్లాలు గా విభజిస్తే ఎవరికీ అభ్యంతరం ఉండదని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎడ్ల అశోక్‌రెడ్డి అన్నా రు. అయితే, హన్మకొండ జిల్లాగా ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించడం అందరినీ విస్మయానికి గురిచేస్తోందని పేర్కొన్నారు.

న్యూశాయంపేట : చారిత్రక నగరాన్ని విడదీ యకుండా వరంగల్‌ జిల్లాను మూడు జిల్లాలు గా విభజిస్తే ఎవరికీ అభ్యంతరం ఉండదని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎడ్ల అశోక్‌రెడ్డి అన్నా రు. అయితే, హన్మకొండ జిల్లాగా ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించడం అందరినీ విస్మయానికి గురిచేస్తోందని పేర్కొన్నారు. ఈ మేరకు జిల్లాల ఏర్పాటుపై శనివారం కలెక్టరేట్‌లో డీఆర్‌ఓకు పార్టీ అభిప్రాయాన్ని వినతిపత్రం ద్వారా అందించారు. భూపాలపల్లి జిల్లాకు జయశంకర్‌ పేరుకు బదులు సమ్మక్క సారక్క పేరు పెట్టాలని, మహబూబాబాద్‌ను మానుకోటగా మార్చాలని కోరారు. జనగామను జిల్లా చేసి ప్రజల ఆకాంక్షను నెరవేర్చాలని వినతిపత్రంలో పేర్కొన్నారు. నాయకులు రాజారెడ్డి, కొత్త దశరథం, శ్రీరాంరెడ్డి, ప్రవీణ్, దిలీప్‌నాయక్, రమణారెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement