స్వప్రయోజనాల కోసం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాష్ట్ర భవిష్యత్‌ను ఢిల్లీ పెద్దల పాదాల ముందు తాకట్టు పెట్టారని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి ముదునూరి ప్రసాదరాజు విమర్శించారు.
ప్యాకేజీలతో ప్రయోజనం లేదు
Sep 7 2016 10:49 PM | Updated on Jul 11 2019 8:35 PM
నరసాపురం: స్వప్రయోజనాల కోసం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాష్ట్ర భవిష్యత్‌ను ఢిల్లీ పెద్దల పాదాల ముందు తాకట్టు పెట్టారని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి ముదునూరి ప్రసాదరాజు విమర్శించారు. బుధవారం ఆయన నివాసంలో విలేకరులతో మాట్లాడుతూ ప్యాకేజీల వల్ల రాష్ట్రానికి ప్రయోజనం ఏమీ ఉండదని, ప్రత్యేక హోదాను పక్కన పెట్టి ప్యాకేజీలకు తలొగ్గడం తగదన్నారు. సాధారణంగా కేంద్రం వెనుకబడిన రాష్ట్రాలకు కొద్దిమేర నిధులు కేటాయిస్తుందని ఈ క్రమంలో మన రాష్ట్రానికి నిధులు ఇస్తుంటే అదే బ్రహ్మాండమనే రీతిలో టీడీపీ నాయకులు ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు.
ఓటుకు నోటు కేసుకు భయపడే..
చంద్రబాబు ఓటుకు నోటు కేసుకు భయపడే, కేంద్రం చేతిలో కీలుబొమ్మగా మారారని ప్రసాదరాజు విమర్శించారు. ప్రత్యేక హోదా వస్తేనే పరిశ్రమల ఏర్పాటుకు భారీ రాయితీలు వస్తాయని చెప్పారు. రాష్ట్రంలో యువతకు ఉద్యోగ, ఉఫాది అవకాశాలు పెరుగుతాయన్నారు. హోదా కోసం జాతీయ స్థాయిలో పోరాటం చేయడానికి వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సిద్ధంగా ఉన్నారని చెప్పారు. గడపగడపకూ కార్యక్రమంలో చంద్రబాబు దమననీతిని ప్రజలకు వివరిస్తున్నామన్నారు.
Advertisement
Advertisement