మా పాలనలో స్కామ్‌లు లేవు | No scames in our regime | Sakshi
Sakshi News home page

మా పాలనలో స్కామ్‌లు లేవు

Jun 6 2016 12:45 AM | Updated on Mar 29 2019 9:04 PM

మా పాలనలో స్కామ్‌లు లేవు - Sakshi

మా పాలనలో స్కామ్‌లు లేవు

కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చిన రెండేళ్లలో అవినీతికి, స్కామ్‌లకు తావు ఇవ్వలేదని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు.

- 2019లో తెలంగాణ బీజేపీదే
- కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్
 
 శామీర్‌పేట్/మేడ్చల్ రూరల్: కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చిన రెండేళ్లలో అవినీతికి, స్కామ్‌లకు తావు ఇవ్వలేదని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. కేంద్రం లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా బీజేపీ ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా మేడ్చల్‌లో ఆదివారం వికాస్‌పర్వ్ పేరుతో భారీ బహిరంగసభను ఏర్పా టు చేశారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు బొక్కా నర్సింహారెడ్డి అధ్యక్షతన జరిగిన సభలో కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడారు. ప్రధాని మోదీ ప్రవేశ పెట్టిన పథకాల ద్వారా దేశంలో, రాష్ర్టంలో ఎంతోవుంది ప్రజలకు లబ్ధి చేకూరుతుందన్నారు.

దేశంలోని ఏ తల్లీ కన్నీరు పెట్టకుండా గ్యాస్ సబ్సిడీ కల్పించావుని పేర్కొన్నారు. దేశాన్ని అభివృద్ధి చేసేం దుకు ప్రధాని విదేశీ పర్యటనలు చేస్తూ పొరుగు దేశాలతో సత్సంబంధాలు పెంచుతున్నారని మంత్రి చెప్పారు. దేశంలోని కశ్మీర్ నుంచి కన్యాకువూరి వరకు బీజేపీ గాలి వీస్తోందని, అన్ని రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు. కేంద్రం రాష్ట్రానికి కేటాయించిన వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపడుతూ తమ నిధులతోనే పనులు చేపడుతున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రచారం చేసుకుంటున్నదని విమర్శించారు. ఇంటింటికీ మోదీ నినాదంతో వెళితే రానున్న కాలంలో తెలంగాణలో బీజేపీ పాగా వేయడం ఖాయమన్నారు. సభలో  కేంద్ర జలవనరులు, పారిశుధ్యశాఖ సహాయమంత్రి రామ్‌కృపాల్‌యూదవ్, కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ, కిసాన్ మోర్చా జాతీయ అధ్యక్షుడు విజయ్‌పాల్ సింగ్ తోవుర్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement