రెండోసారి బోణి లేదు! | no funds on secound time | Sakshi
Sakshi News home page

రెండోసారి బోణి లేదు!

Aug 11 2016 11:30 PM | Updated on Sep 4 2017 8:52 AM

కొలిమికాడపల్లె వద్ద హంద్రీ–నీవా సొరంగం

కొలిమికాడపల్లె వద్ద హంద్రీ–నీవా సొరంగం

హంద్రీ–నీవా సాగునీటి ప్రాజక్టులో సవాలుగా మారిన సొరంగం పనులు మరింత జాప్యమయ్యేలా ఉన్నాయి. తంబళ్లపల్లె నియోజకవర్గం పెద్దమండ్యం మండలంలో టన్నల్‌ (సొరంగం) పనులకు రెండోసారి నిర్వహించిన టెండర్లకు ఒక్క టెండరూ దాఖలుకాలేదు.

– సొరంగం పనులకు దాఖలు కానిటెండరు
–రెండోసారీ అధికారులకు భంగపాటు
–నిబంధనలు సడలించినా రాని స్పందన
–హంద్రీనీవా పనుల్లో అనివార్యమైన జాప్యం
 
బి.కొత్తకోట:
హంద్రీ–నీవా సాగునీటి ప్రాజñ క్టులో సవాలుగా మారిన సొరంగం పనులు మరింత జాప్యమయ్యేలా ఉన్నాయి. తంబళ్లపల్లె నియోజకవర్గం పెద్దమండ్యం మండలంలో టన్నల్‌ (సొరంగం) పనులకు రెండోసారి నిర్వహించిన టెండర్లకు ఒక్క టెండరూ దాఖలుకాలేదు. గొళ్లపల్లె నుంచి వైఎస్సార్‌కడపజిల్లా చిన్నమండ్యం మండలం కొటగడ్డకాలనీ వరకు మట్టిలో సొరంగ మార్గం తవ్వేపని అప్పగించేందుకు 20బి ప్యాకేజిలోని 2కిలోమీటర్ల పనికి రూ.70.82కోట్లతో జూన్‌లో ప్రభుత్వం టెండర్లు నిర్వహించింది. టెండర్లలో మ్యాక్స్‌ఇన్‌ఫ్రా సంస్థ ఒక్కటే పాల్గొంది. రూ.70.82కోట్ల పనికి 3.99శాతం (రూ.2.80కోట్లు) అదనంతో టెండర్‌ దాఖలు చేయగా దీన్ని రద్దు చేస్తూ కమిషనర్‌ ఆఫ్‌ టెండర్స్‌ కమిటి (సీఓటీ) నిర్ణయం తీసుకుంది. దీంతో టెండర్ల వ్యవహారం మొదటికొచ్చింది.
 రెండోసారి టెండర్లు నిర్వహిస్తే ఎక్కువ సంఖ్యలో కాంట్రాక్టర్లు టెండర్లలో పాల్గొంటారని, పనులు త్వరగా పూర్తి చేయించవచ్చని ప్రభుత్వం ఆశించింది. దీనికోసం టెండర్‌దారుల సాంకేతిక అర్హతలను 50శాతానికి కుదించింది. పనికి టెండర్ల దాఖలుచేసే సంస్థ ఏడాది కాలంలో 1.25కిలోమీటర్ల సొరంగం పనులు, 8వేల క్యూబిక్‌ మీటర్ల సొరంగం కాంక్రీట్‌ పనులు చేస్తే చాలని నిబంధనలు సడలించింది. దేశంలో ఏ సంస్థ అయినా టెండర్లలో పాల్గొనే అవకాశం కల్పించింది.  జూలై 25న రెండోసారి టెండర్లకు ఆహ్వనించారు. ఈనెల 8 వరకు టెండర్లు దాఖలు చేసేందుకు గడవుగా నిర్ణయించారు. పని దక్కించుకునేందుకు ఆశించిన మేరకు టెండర్లు దాఖలై ఉంటాయని భావించిన అధికారులు ఊహించని పరిణామం ఎదురైంది. టెండర్ల గడువు ముగిశాక బుధవారం హంద్రీ–నీవా సర్కిల్‌–3 ఉన్నతాధికారులు టెండర్లు పరిశీలించేందుకు చర్యలు చేపట్టగా అవాక్కయ్యారు. ఆన్‌లైన్‌లో ఒక్క టెండరూ దాఖలు కాలేదు. తొలిసారి నిర్వహించిన టెండర్లలో ఒక్క టెండరైనా దాఖలైంది. రెండోసారి టెండర్లకు ఆ సింగిల్‌ టెండర్‌ కూడా లేదు. 
ఈ పరిస్థితిని ప్రభుత్వానికి నివేదించి తదుపరి చర్యలు తీసుకోంటామని హాంద్రీ–నీవా సర్కిల్‌–3 ఎస్‌ఈ ఆర్‌.మురళీనాధరెడ్డి గురువారం చెప్పారు. సొరంగం పనులను డిసెంబర్‌లోగా పూర్తి చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రావడంలేదు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాల్సివుంటుందని చెప్పారు.    
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement