విలాసవంతమైన భవనాలు ధనికులకే కాదు సామాన్యులకు కూడా అందించి, వారి సొంతింటి కలను నిజం చేయాలనే ఆశయంతోనే ’చంద్రిక అవంతిక’ (ది ప్రిన్సెస్ ఆఫ్ రాజమహేంద్రవరం) పేరుతో వెంచర్‌ని ప్రారంభించామని రాకీ ఎవెన్యూస్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్
-
జీవనదుల పేర్లతో 11 బ్లాకులు
-
480 ఫ్లాట్లతో నిర్మాణం
చక్రద్వారబంధం (రాజానగరం) :
విలాసవంతమైన భవనాలు ధనికులకే కాదు సామాన్యులకు కూడా అందించి, వారి సొంతింటి కలను నిజం చేయాలనే ఆశయంతోనే ’చంద్రిక అవంతిక’ (ది ప్రిన్సెస్ ఆఫ్ రాజమహేంద్రవరం) పేరుతో వెంచర్‌ని ప్రారంభించామని రాకీ ఎవెన్యూస్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టరు రామ య్య వేణు అన్నారు. చక్రద్వారబంధం పంచాయతీ పరిధిలో 9.9 ఎకరాల విస్తీర్ణంలో గంగ, గోదావరి, యమున, సరస్వతి, కృష్ణ, తుంగభద్ర, కావేరి, నేత్రావతి, ఆర్కావతి, బ్రహ్మపుత్ర వంటి పేర్లతో 11 బ్లాకులలో నిర్మించే 480 ఫ్లాట్ల నిర్మాణానికి ఆదివారం రామయ్య వేణు దంపతులు భూమి పూజ చేశారు. అందరికీ అందుబాటులో ఉండే ధరతో రెండు సంవత్సరాలలోనే లబ్ధిదారులకు అందజేసే విధంగా నిర్మాణం పూర్తి చేస్తామని వేణు చెప్పారు. వెంచర్ బ్రోచర్‌ని ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీలు సోము వీర్రాజు, ఆదిరెడ్డి అప్పారావు, చైతన్య విద్యా సంస్థల చైర్మన్, మాజీ ఎమ్మెల్సీ కేవీవీ సత్యనారాయణరాజు పాల్గొన్నారు.