నేను చేస్తున్న పూజల కారణంగానే... | my shiva puja saves vizag people from hud hud cyclone | Sakshi
Sakshi News home page

నేను చేస్తున్న పూజల కారణంగానే...

Sep 18 2015 5:28 PM | Updated on Sep 3 2017 9:35 AM

నేను చేస్తున్న పూజల కారణంగానే...

నేను చేస్తున్న పూజల కారణంగానే...

తాను చేస్తున్న శివపూజల కారణంగానే హుద్-హుద్ తుపానులో ప్రాణనష్టం తప్పిందని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు టి.సుబ్బిరామిరెడ్డి అన్నారు.

విశాఖపట్నం: తాను చేస్తున్న శివపూజల కారణంగానే హుద్-హుద్ తుపానులో ప్రాణనష్టం తప్పిందని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు టి.సుబ్బిరామిరెడ్డి అన్నారు.  విశాఖ నగరంలోని ఆనందపురంలో ఎంపీ నిధులతో నిర్మించిన కమ్యూనిటీ భవన్ ను శుక్రవారం ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ... విశాఖ నగరాన్ని చిగురుటాకులా వణికించిన హుద్-హుద్ తుపానులో ప్రాణనష్టం జరగకపోవడానికి తాను చేస్తున్న ఈశ్వర పూజలే కారణమని వ్యాఖ్యానించారు. సుబ్బిరామిరెడ్డి శివభక్తుడన్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. ఈశ్వరుడిని ఆయన నిత్యం పూజిస్తూ ఉంటారు. ప్రత్యేక యాగాలు, హోమాలు నిర్వహిస్తుంటారు.

Advertisement
 
Advertisement
Advertisement