ముద్రగడ పద్మనాభం పాదయాత్రకు అనుమతులు లేవని ఏలూరు రేంజ్ డీఐజీ పీవీ రామకృష్ణ స్పష్టం చేశారు. రావులపాలెంలో చేపడుతున్న ముందస్తు చర్యలు పర్యవేక్షించేందుకు సోమవారం వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. అనుమతులు కోరుతూ
-
ఏలూరు రేంజ్ డీఐజీ పీవీ రామకృష్ణ
రావులపాలెం (కొత్తపేట) :
ముద్రగడ పద్మనాభం పాదయాత్రకు అనుమతులు లేవని ఏలూరు రేంజ్ డీఐజీ పీవీ రామకృష్ణ స్పష్టం చేశారు. రావులపాలెంలో చేపడుతున్న ముందస్తు చర్యలు పర్యవేక్షించేందుకు సోమవారం వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. అనుమతులు కోరుతూ పోలీస్ అధికారులకు ఎవ్వరూ దరఖాస్తు చేయలేదన్నారు. అనుమతులు లేనందునా ఎటువంటి కార్యక్రమాలు చేపట్టినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. అంతకు ముందు పోలీస్‌స్టేçÙ¯ŒSలో బందోబస్తు చర్యల్లో భాగంగా ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు.
బందోబస్తుపై సమీక్ష
అమలాపురం టౌ¯ŒS : కాపుల పాదయాత్రకు సంబంధించి అమలాపురం పట్టణ పోలీసు స్టేష¯ŒSలో ఏలూరు రేంజ్ డీఐజీ రామకృష్ణ పోలీసు అధికారులతో సోమవారం రాత్రి సమీక్షించారు. యాత్ర అనివార్యమైతే అడ్డుకునేందుకు ఎలాంటి చర్యలు చేపట్టాలో చర్చించారు. కోనసీమలో జిల్లాల వారీగా నియమింపబడ్డ బందోబస్తుల జాబితాలకు అనుగుణంగా ప్రతి మండలంలో పోలీసు బలగాలపై ఆరా తీశారు. వంతెనలపై ఏర్పాటు చేసే చెక్ పోస్టులు, డ్రో¯ŒS కెమెరాలు, రాపిడ్ యాక్ష¯ŒS ఫోర్సు తదితర అంశాలపై ఆయన లోతుగా సమీక్షించారు. డీఎస్పీ లంక అంకయ్య, సీఐలు వైఆర్‌కే శ్రీనివాస్, జి.దేవకుమార్, ఇతర సీఐల నుంచి కూడా డీఐజీ బందోబస్తుకు సంబంధించి పలు సూచనలు, సలహాలు స్వీకరించారు. కోనసీమ దిగ్బంధనానికి రూపొం దించిన ప్రణాళికపై ఆయన చర్చించారు.