'బావమరిది కోసం వైఎస్ఆర్ కాళ్లు పట్టుకున్నావు' | mudragada padmanabham takes on chandrababu | Sakshi
Sakshi News home page

'బావమరిది కోసం వైఎస్ఆర్ కాళ్లు పట్టుకున్నావు'

Sep 25 2016 11:02 AM | Updated on Jul 30 2018 6:21 PM

'బావమరిది కోసం వైఎస్ఆర్ కాళ్లు పట్టుకున్నావు' - Sakshi

'బావమరిది కోసం వైఎస్ఆర్ కాళ్లు పట్టుకున్నావు'

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం బహిరంగ సవాల్ విసిరారు.

కాకినాడ : నావి దొంగ దీక్షలని విమర్శిస్తున్నారు... మరి అధికారంలో లేనప్పుడు మీరు చేసిన దీక్షలను ఏమనాలో చెప్పాలని సీఎం చంద్రబాబుకు కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం డిమాండ్ చేశారు. ఆదివారం తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో చంద్రబాబుకు ముద్రగడ బహిరంగ లేఖ రాశారు. ఆ లేఖను ముద్రగడ విడుదల చేశారు. దమ్ముంటే ప్రత్యేక హోదా కోసం ఆమరణ దీక్ష చేయండి అంటూ చంద్రబాబుకు సవాల్ విసిరారు. మీతోపాటు నేను కూడా దీక్షలో పాల్గొంటానని ముద్రగడ స్పష్టం చేశారు. మీరే దీక్ష తేదీ నిర్ణయించండి... ఎవరి సత్తా ఏమిటో తేలుతుందన్నారు.

బావమరిది బాలకృష్ణ కోసం నాడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ కాళ్లు పట్టుకుని వేడుకున్నావని ఈ సందర్భంగా చంద్రబాబుకు ముద్రగడ గుర్తు చేశారు. మీ స్ఫూర్తి వల్లే కాపు ఉద్యమం పుట్టింది... దీనికి మూలకారకులు మీరే అని ముద్రగడ పేర్కొన్నారు. మీ దయ వల్ల నాకు సిగ్గు, లజ్జ పూర్తిగా పోయాయన్నారు. మహా అయితే ఆఖరి అస్త్రంగా పోలీసుల చేత.. నా బట్టలు ఊడదీయించి బూటు కాళ్లతో తన్నిస్తారన్నారు. నన్ను ఏమైనా చేసుకోండి.. కానీ మా జాతికిచ్చిన హామీని అమలు చేయాల్సిందే అని ముద్రగడ పద్మనాభం స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement