పార్టీ మారితే వేటేయాలి | MP MEKAPATI rajamohana Reddy comments at all-party meeting | Sakshi
Sakshi News home page

పార్టీ మారితే వేటేయాలి

Apr 25 2016 2:14 AM | Updated on Aug 10 2018 8:16 PM

పార్టీ మారితే  వేటేయాలి - Sakshi

పార్టీ మారితే వేటేయాలి

పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని కచ్చితంగా అమలు చేయాలని, చట్టంలో లోపాలుంటే సవరించాలని వైఎస్సార్‌సీపీ కోరింది. లోక్‌సభ స్పీకర్ అధ్యక్షతన ఆదివారం ఢిల్లీలో

♦ ఫిరాయించిన వారి సభ్యత్వాన్ని గడువులోగా రద్దు చేయాలి
♦ అఖిలపక్ష సమావేశంలో  మేకపాటి రాజమోహన్‌రెడ్డి
 
 సాక్షి, న్యూఢిల్లీ: పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని కచ్చితంగా అమలు చేయాలని, చట్టంలో లోపాలుంటే సవరించాలని వైఎస్సార్‌సీపీ కోరింది. లోక్‌సభ స్పీకర్ అధ్యక్షతన ఆదివారం ఢిల్లీలో నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో పార్టీ లోక్‌సభా పక్ష నేత మేకపాటి రాజమోహన్‌రెడ్డి మాట్లాడారు. ఒక సభ్యుడు పార్టీ మారగానే అతడి సభ్యత్వం రద్దయ్యేలా పటిష్టమైన చట్టాలను అమల్లోకి తీసుకొస్తే ఫిరాయింపులను నిరోధించవచ్చని చెప్పారు. అఖిలపక్ష సమావేశం వివరాలను ఆయన ఏపీ భవన్ వద్ద విలేకరులకు వివరించారు.

‘‘అఖిలపక్ష సమావేశంలో ఎక్కువ మంది నేతలు దేశంలో నెలకొన్న కరువు పరిస్థితులు, మంచినీటి కొరత గురించి ప్రస్తావించారు. నేను ఏపీలోని కరువు, వర్షాభావ పరిస్థితులను వివరించాను. తెలంగాణ ప్రభుత్వం మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికీ నల్లా నీరు ఇచ్చే పథకం చేపట్టింది. ఇదే పథకాన్ని అన్ని రాష్ట్రాలు, కేంద్రం అమలు చేయాల్సిన అవసరం ఉందని చెప్పాను. విభజన చట్టంలో ఏపీకి ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చాలి. ప్రత్యేక హోదా, ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ వంటి వాటిని అమలు చేయాలి. వీటికోసం అఖిలపక్ష సమావేశంలో ప్రస్తావించాను’ అని మేకపాటి పేర్కొన్నారు.

 ఫిరాయింపులను ప్రజలు సహించరు..
 ‘‘ఏపీలో కొత్త పరిస్థితులు ఏర్పడ్డాయి. అధికార పక్షం టీడీపీ ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ నుంచి 13 మంది ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకుంది. ఫిరాయింపులను ఆపడానికి పటిష్టమైన చట్టాన్ని రూపొందించుకోవాలి.  వైఎస్సార్‌సీపీ బీ-ఫారంపై పోటీ చేసి గెలిచిన ఎమ్మెల్యేలు టీడీపీలో చేరడం ఎంతవరకు సబబు? ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఏమాత్రం నైతిక విలువలు ఉన్నా ఇలాంటి ఫిరాయింపులను ప్రోత్సహిస్తారా? ఏపీలో రెవెన్యూ లోటు భారీగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి విరివిగా నిధులు తెచ్చుకొని రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాల్సింది పోయి రోజుకొకరిని అధికార పార్టీలో చేర్చుకోవడాన్ని ప్రజలు సహించరు’’ అని ఎంపీ మేకపాటి వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement