తల్లిపాలు అమృతం వంటివి | mother feed is like ambrosi | Sakshi
Sakshi News home page

తల్లిపాలు అమృతం వంటివి

Aug 5 2016 11:34 PM | Updated on Sep 4 2017 7:59 AM

తల్లిపాలు అమృతం వంటివి

తల్లిపాలు అమృతం వంటివి

తల్లిపాలు అమృతం వంటివని ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. తల్లిపాలలో ఉన్న శక్తి ఎందులోనూ లభించదని, పుట్టిన బిడ్డకు తప్పనిసరిగా తల్లిపాలు అందించాలన్నారు.

నకిరేకల్ః
తల్లిపాలు అమృతం వంటివని  ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. తల్లిపాలలో ఉన్న శక్తి ఎందులోనూ లభించదని, పుట్టిన బిడ్డకు తప్పనిసరిగా తల్లిపాలు అందించాలన్నారు.  నకిరేకల్‌లో ఐసీడీఎస్‌ ప్రాజెక్టు కార్యాలయం ఆధ్వర్యంలో శుక్రవారం తల్లిపాల వారోత్సవాల ర్యాలీ నిర్వహించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ బిడ్డ పుట్టిన వెంటనే ముర్రుపాలు తాగించాలన్నారు. అంగన్‌వాడీ కేంద్రాల ఆధ్వర్యంలో అందజేస్తున్న పౌష్టికాహార పదార్థాలను గర్భిణులు, బాలింతలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.  కార్యక్రమంలో ఎంపీపీ లింగాల మల్లీశ్వరి వెంకన్న, జెడ్పీటీసీ పెండెం ధనలక్ష్మి సదానందం, సర్పంచ్‌ పన్నాల రంగమ్మ రాఘవరెడ్డి, టీఆర్‌ఎస్‌ జిల్లా నాయకులు పూజర్ల శంభయ్య, ఉప సర్పంచ్‌ మంగినపల్లి రాజు,  ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌ అరుణశ్రీ, హెల్త్‌ సూపర్‌వైజర్‌ కాంతమ్మ, అనసూయమ్మ, ఐసీడీఎస్‌ సూపర్‌వైర్లు వెంకటరమణమ్మ, సాయిగీత, మంజులత, వినోద, సిబ్బంది పర్వేజ్‌ వసీం, జ్యోతి, నీలమ్మ పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement