కళ్లలో కారం కొట్టి లక్షలు చోరీ | money theft from HP gas employee vishnu | Sakshi
Sakshi News home page

కళ్లలో కారం కొట్టి లక్షలు చోరీ

Mar 5 2016 5:45 PM | Updated on Apr 6 2019 8:52 PM

విధులు ముగించుకుని వెళ్తున్న ఓ ఉద్యోగి కళ్లలో కారం కొట్టి దుండగులు రూ.4.5లక్షలు అపహరించారు.

పటాన్‌చెరు(మెదక్): విధులు ముగించుకుని వెళ్తున్న ఓ ఉద్యోగి కళ్లలో కారం కొట్టి దుండగులు రూ.4.5లక్షలు అపహరించారు. ఈ ఘటన శనివారం సాయంత్రం పటాన్‌చెరు పరిధిలో చోటు చేసుకుంది. కిష్టారెడ్డిపేటలోని హెచ్‌పీ గ్యాస్ గోడౌన్‌లో పనిచేస్తున్న విష్ణు అనే ఉద్యోగి బైక్‌పై వెళ్తున్నాడు. మార్గంమధ్యలో ఉండగా దుండగులు ఆ ఉద్యోగిని అడ్డగించి అతని కళ్లలో కారం కొట్టారు. అనంతరం అతని వద్ద ఉన్న నగదు రూ.4.5లక్షలు దోచుకుని పరారయ్యారు. దీనిపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.

Advertisement
 
Advertisement
Advertisement