మోదీకి వినూత్నంగా శుభాకాంక్షలు
ప్రధానమంత్రి నరేంద్రమోదీకి విద్యార్థులు వినూత్నరీతిలో శుభాకాంక్షలు తెలిపారు.
తూర్పుగోదావరి(అమలాపురం): రేపు (సెప్టెంబర్ 17న)
ప్రధానమంత్రి నరేంద్రమోదీ జన్మదినం సందర్భంగా విద్యార్థులు శుక్రవారం వినూత్నరీతిలో శుభాకాంక్షలు తెలిపారు. విద్యానిధి విద్యాసంస్థ (విట్స్)లకు చెందిన విద్యార్థులు ఇండియా మ్యాప్ ఆకారంలో కూర్చొని మధ్యన మోదీ చిత్రాన్ని ముద్రించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
విద్యాసంస్థల చైర్మన్ ఎ.బి.నాయుడు, కరస్పాండెంట్ శ్యామలా మహాలక్ష్మి, డైరెక్టర్ వై.నాని, కాలేజీ, స్కూల్ ప్రిన్సిపాల్‌ళ్లు బి.సుధీర్‌బాబు, నాగమాధవిలు పాల్గొన్నారు.