ఎమ్మెల్సీ ఓటరు నమోదుకు 19 వరకు అవకాశం | mle voter registration extended up to 19th | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్సీ ఓటరు నమోదుకు 19 వరకు అవకాశం

Dec 9 2016 11:36 PM | Updated on Sep 4 2017 10:18 PM

శాసనమండలి ఉపాధ్యాయ, పట్టభద్రుల నియోజకవర్గాల ఎన్నికలకు సంబంధించిన ఓటరుగా నమోదు అయ్యేందుకు ఈనెల 19వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని ఎన్నికల కమిషన్‌ ఉత్తర్వులు జారీ చేసింది.

కర్నూలు(అగ్రికల్చర్‌) : శాసనమండలి ఉపాధ్యాయ, పట్టభద్రుల నియోజకవర్గాల ఎన్నికలకు సంబంధించిన ఓటరుగా నమోదు అయ్యేందుకు ఈనెల 19వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని ఎన్నికల కమిషన్‌ ఉత్తర్వులు జారీ చేసింది. గత నెలలో మండలి ఎన్నిల నిర్వహణకు జిల్లా యంత్రాంగం ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రకటించింది. దీనిపై అభ్యంతరాలకు, ఓటరుజాబితాలో పేర్లు లేని వారు తిరిగి దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 8వ తేదీ వరకు మాత్రమే అవకాశం ఉండేది. దీనిని ఎన్నికల కమిషన్‌ ఈ నెల 19వ తేదీ వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement