ఎమ్మెల్సీ ఓటర్ల తుది జాబితా సిద్ధం | mlc voter list ready | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్సీ ఓటర్ల తుది జాబితా సిద్ధం

Jan 12 2017 11:46 PM | Updated on Sep 5 2017 1:06 AM

పశ్చిమ రాయలసీమ(అనంతపురం, కర్నూలు, వైఎస్సార్‌) జిల్లాల పట్టభద్ర, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటర్ల జబితా సిద్ధమయ్యింది.

అనంతపురం అర్బన్‌ : పశ్చిమ రాయలసీమ(అనంతపురం, కర్నూలు, వైఎస్సార్‌) జిల్లాల పట్టభద్ర, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటర్ల జబితా సిద్ధమయ్యింది. ఎన్నికల కమిషన్‌ షెడ్యూల్‌ ప్రకారం ఓటర్ల తుది జాబితాలను ఎలక్ట్రోల్‌ రిజిస్ట్రేషన్‌ అధికారి, డీఆర్వో సి.మల్లీశ్వరిదేవి గురువారం విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత నెల 23 వరకు వచ్చిన క్లయిమ్‌లు, అభ్యంతరాలను క్షుణ్ణంగా పరిశీలించి తుది జాబితాను పక్కగా రూపొందించామన్నారు. పట్టభద్ర ఎమ్మెల్సీ నియోజకవర్గ పరిధిలో 2,53,515 మంది ఓటర్లు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గ పరిధిలో 20,644 మంది ఓటర్లు ఉన్నట్లు తెలిపారు.

పట్టభద్రులు
జిల్లా        పురుష ఓటర్లు    మహిళ ఓటర్లు    ఇతరులు     మొత్తం
వైఎస్సార్‌        54,643        24,339        519        79,501
అనంతపురం    61,081        27,402        777        89,260
కర్నూలు        59,410        24,925        419        84,754
.............................................................................................
మొత్తం        1,75,134        76,666        1,715        2,53,515

ఉపాధ్యాయులు
జిల్లా        పురుష ఓటర్లు    మహిళ ఓటర్లు    ఇతరులు     మొత్తం
వైఎస్సార్‌        3,949            1,898            30        5,877
అనంతపురం    5,149            2,637            31        7,817
కర్నూలు        4,499            2,424            27        6,950
.............................................................................................
మొత్తం        13,597        6,959            88        20,644
---------------------------------------------------

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement