
'ఎన్ని కేసులు పెట్టినా భయపడం'
రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అరెస్ట్ ను నగరి వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ఆర్ కే రోజా ఖండించారు.
తిరుపతి: రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అరెస్ట్ ను నగరి వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ఆర్ కే రోజా ఖండించారు. వైఎస్సార్ సీపీపై సీఎం చంద్రబాబు కక్ష సాధిస్తున్నారని ఆమె ఆరోపించారు. ఆదివారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ... అక్రమ కేసులతో తమ పార్టీ ప్రజా ప్రతినిధులను భయపెట్టాలని చూస్తున్నారని అన్నారు.
ఎన్ని కేసులు పెట్టినా భయపడబోమని, బెదిరింపులకు లొంగబోమని స్పష్టం చేశారు. తమపై పెట్టిన కేసులను ప్రజాస్వామ్యయుతంగా ఎదుర్కొంటామని చెప్పారు.