బాలకృష్ణ పీఏ హల్‌చల్‌ | mla personal secretary hulchal | Sakshi
Sakshi News home page

బాలకృష్ణ పీఏ హల్‌చల్‌

Sep 18 2016 8:04 AM | Updated on Sep 4 2017 1:53 PM

బాలకృష్ణ పీఏ హల్‌చల్‌

బాలకృష్ణ పీఏ హల్‌చల్‌

హిందూపురం సబ్ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ఎమ్మెల్యే బాలకృష్ణ వ్యక్తిగత కార్యదర్శి శేఖర్‌ శనివారం హల్‌చల్‌ చేశారు.

హిందూపురం అర్బన్‌ : 
హిందూపురం సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ఎమ్మెల్యే బాలకృష్ణ వ్యక్తిగత కార్యదర్శి శేఖర్‌ శనివారం హల్‌చల్‌ చేశారు. తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి కార్యాలయానికి వచ్చి ఎమ్మెల్యే స్థాయిలో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కిందిస్థాయి ఉద్యోగులపై హెచ్చరికలు జారీ చేస్తూ ఇలాగే ఉండాలంటూ హుకుం వేశారు.

కొత్తగా చిత్తూరు నుంచి పదోన్నతిపై ఇక్కడి వచ్చిన సబ్‌ రిజిస్ట్రార్‌ వెంకటేశ్వర్లుకు అందరూ సహకరించాలన్నారు. ఏదైనా ఇబ్బంది కల్గించిన సహించేది లేదని హెచ్చరించారు. కండసారా ఫ్యాక్టరీ భూములు రిజిస్ట్రేషన్‌కు ఎందుకు పెట్టాల్సి వచ్చిందని అధికారులపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆయన తీవ్రస్థాయిలో హెచ్చరిస్తూ బెదిరిస్తుండటంతో కార్యాలయ సిబ్బంది బెంబేలెత్తిపోయారు.

Advertisement
 
Advertisement
Advertisement