బెజవాడ పశ్చిమ టీడీపీలో కలకలం | mla jaleel khan appointed vijayawada urban tdp president | Sakshi
Sakshi News home page

బెజవాడ పశ్చిమ టీడీపీలో కలకలం

Oct 31 2016 6:24 PM | Updated on Aug 10 2018 8:23 PM

బెజవాడ పశ్చిమ టీడీపీలో కలకలం - Sakshi

బెజవాడ పశ్చిమ టీడీపీలో కలకలం

బెజవాడ పశ్చిమ నియోజకవర్గ టీడీపీలో కలకలం రేగింది.

విజయవాడ : బెజవాడ పశ్చిమ నియోజకవర్గ టీడీపీలో కలకలం రేగింది. పార్టీ అధిష్టానం నియోజకవర్గ ఇంచార్జ్ బాధ్యతల నుంచి నాగుల్ మీరాను తొలగించింది. ఆయన స్థానంలో జలీల్ ఖాన్కు ఇంచార్జ్ బాధ్యతలు అప్పగించింది. దీంతో మీరాను తొలగించడంపై కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

పార్టీని నమ్ముకుంటే మోసం చేస్తారా అంటూ మీరా మద్దతుదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్‌ పార్టీ ఫిరాయించిన విషయం తెలిసిందే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తు నుంచి గెలిచిన ఆయన ఆ తర్వాత టీడీపీలో చేరారు. అయితే జలీల్ ఖాన్ చేరిక పట్ల పార్టీ నేతల నుంచే తీవ్ర అభ్యంతరాలు ఎదురైన విషయం తెలిసిందే. పార్టీ తాజా నిర్ణయంతో నాగుల్ మీరా అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement