ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో శనివారం ఉదయం శనివారం ఉదయం భూమి కంపించింది.
నెల్లూరు: ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో శనివారం ఉదయం స్వల్పంగా భూమి కంపించింది. ఉదయం 8.44 గంటల సమయంలో సుమారు రెండు నిమిషాల పాటు భూప్రకంపనలు రావటంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. ప్రజలు ఇళ్లల్లోంచి బయటకు పరుగులు తీశారు.
రెండు జిల్లాల్లోని ఉదయగిరి, వింజమూరు, దుత్తలూరు, కనిగిరి మండలాల్లో భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. దీంతో ఇళ్లల్లోని వస్తువులు కింద పడిపోయాయి. కొన్ని చోట్ల పాతబావులు కూలిపోయాయి. గత ఏడాది కాలంలో భూ ప్రకంపనలు రావడం 23వ సారి అని స్థానికులు చెబుతున్నారు.