'నిరాహారదీక్ష ఎందుకో ముద్రగడ చెప్పాలి' | minister narayana question to mudragada | Sakshi
Sakshi News home page

'నిరాహారదీక్ష ఎందుకో ముద్రగడ చెప్పాలి'

Feb 2 2016 10:35 AM | Updated on Sep 3 2017 4:49 PM

'నిరాహారదీక్ష ఎందుకో ముద్రగడ చెప్పాలి'

'నిరాహారదీక్ష ఎందుకో ముద్రగడ చెప్పాలి'

ముద్రగడ పద్మనాభం ఎందుకు నిరాహార దీక్షకు దిగుతున్నారో స్పష్టం చేయాలని మంత్రి నారాయణ డిమాండ్ చేశారు.

విజయవాడ: ముద్రగడ పద్మనాభం ఎందుకు నిరాహార దీక్షకు దిగుతున్నారో స్పష్టం చేయాలని మంత్రి నారాయణ డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... కాపులను బీసీల్లో చేర్చే 30 నంబరు జీవో వల్ల ఎటువంటి ప్రయోజనం లేదని తెలిపారు. ఈ రోజు సాయంత్రం కాపు నేతలతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశమవుతారని చెప్పారు. కాపులకు రిజర్వేషన్లు కల్పించకుంటే ఈ నెల 5 నుంచి తన సతీమణితో కలిసి ఆమరణ నిరాహార దీక్ష చేపడతానని ముద్రగడ పద్మనాభం సోమవారం ప్రకటించిన నేపథ్యంలో నారాయణ స్పందించారు.

కాగా, సీఆర్ డీఏ పరిధిలో రహదారుల కోసం 6 గ్రామాల్లో 1200 ఇళ్లు తొలగించాల్సివుంటుందని తెలిపారు. రాజధాని మాస్టర్ ప్లాన్ పై చర్చించేందుకు రేపు సింగపూర్ బృందం వస్తోందన్నారు. మాస్టర్ ప్లాన్ గడువును మరో వారం పాటు పోడిగించినట్టు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement