బ్లేడ్‌ బ్యాచ్‌ చేతిలో యువకుడి హత్య | men murder | Sakshi
Sakshi News home page

బ్లేడ్‌ బ్యాచ్‌ చేతిలో యువకుడి హత్య

Sep 19 2016 8:58 PM | Updated on Apr 3 2019 3:50 PM

నగరంలో ఆదివారం రాత్రి హత్యకు గురైన యువకుడి ఆచూకీ లభించింది. బ్లేడ్‌ బ్యాచ్‌కు చెందిన యువకులే ఈ హత్య చేశారని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ఇప్పటికే కొంతమందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నలుగురిని అరెస్ట్‌ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆర్యాపురం మూలగొయ్యి ప్రాంతానికి చెందిన పందిరి శివ (25) పాత నేరస్తుడు. అతనిపై అనేక కేసులు ఉన్నాయి.

రాజమహేంద్రవరం క్రైం : 
నగరంలో ఆదివారం రాత్రి హత్యకు గురైన యువకుడి ఆచూకీ లభించింది. బ్లేడ్‌ బ్యాచ్‌కు చెందిన యువకులే ఈ హత్య చేశారని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.  ఇప్పటికే కొంతమందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నలుగురిని అరెస్ట్‌ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆర్యాపురం మూలగొయ్యి ప్రాంతానికి చెందిన పందిరి శివ (25) పాత నేరస్తుడు. అతనిపై అనేక కేసులు ఉన్నాయి. కోటగుమ్మం సెంటర్‌లో జరిగిన గొడవల్లోను, కొన్ని ఆర్థికపరమైన లావాదేవీల విషయంలో శివను ఆదివారం సాయంత్రం ఐదుగురు స్నేహితులు ఇంటికి వచ్చి బయటకు తీసుకుÐð ళ్లారు. మల్లయ్యపేట పెట్రోల్‌ బంక్‌ వెనుక వైపు ఉన్న నిర్జన ప్రదేశానికి శివను తీసుకువెళ్లి రాడ్‌లతో తలపై బలంగా కొట్టి దారుణంగా హత్య చేశారు. ఈ దాడిలో పది మంది పాల్గొన్నట్టు పోలీసుల విచారణలో తేలింది. ఇప్పటికే నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. మిగిలిన వారి కోసం త్రీటౌన్‌ పోలీసులు  గాలిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 
ఎంత మందిని చంపుతారు 
బ్లేడ్‌ బ్యాచ్‌ కు చెందిన వ్యక్తులు ఒకరినొకరు దారుణంగా చంపుకోవడం ఎక్కువ అయిందని శివ తండ్రి రాజు, తల్లి లక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ హత్యలకు రాజేంద్ర నగర్‌కు చెందిన ఒక వ్యక్తి కారణమని ఆరోపించారు. హంతకులపై, దీనికి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోకపోతే మరిన్ని హత్యలు జరగవచ్చని అన్నారు. బ్లేడ్‌ బ్యాచ్‌ కు చెందిన నిందితులను వెంటనే అరెస్ట్‌ చేసి కఠినంగా శిక్షించాలని కోరారు. 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement