‘గీతం’లో ఎంబీఏ అడ్మిషన్లు | mba admissions in geetham university | Sakshi
Sakshi News home page

‘గీతం’లో ఎంబీఏ అడ్మిషన్లు

Aug 6 2016 12:58 AM | Updated on Sep 4 2017 7:59 AM

గీతం యూనివర్సిటీ అనుబంధంగా బెంగళూరులోని స్కూల్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ స్టడీస్‌లో 2016–17 విద్యా సంవత్సరానికి ఎంబీఏ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ ఎంవీ రాంప్రసాద్‌ ఓ ప్రకటనలో తెలిపారు.

అనంతపురం ఎడ్యుకేషన్‌ : గీతం యూనివర్సిటీ అనుబంధంగా బెంగళూరులోని స్కూల్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ స్టడీస్‌లో 2016–17 విద్యా సంవత్సరానికి ఎంబీఏ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ ఎంవీ రాంప్రసాద్‌ ఓ ప్రకటనలో తెలిపారు. డిగ్రీ తత్సమాన కోర్సులో 50 శాతం మార్కులతో ఏదైనా  గుర్తింపు పొందిన విశ్వ విద్యాలయం నుంచి డిగ్రీ పూర్తి చేసినవారికి వ్యక్తిగత ఇంటర్వ్యూ, గ్రూప్‌ డిస్కషన్ల ఆధారంగా ప్రవేశం కల్పిస్తామని పేర్కొన్నారు.


జాతీయ ప్రవేశ పరీక్షలు క్యాట్, మ్యాట్, జీమాట్,  సిమాట్, క్సాట్‌లలో ఏదైనా ఒకదానిలో ఉత్తీర్ణత సాధించిన  వారు లేదా 60 శాతం మార్కులతో డిగ్రీ పూర్తి చేసిన వారు నేరుగా ఎంబీఏలో చేరేందుకు అర్హులన్నారు. విద్యార్థులకు ఎంబీఏ పుస్తకాలు ఉచితంగా అందజేస్తామని వెల్లడించారు. ఎంబీఏలో ఫైనాన్స్, మార్కెటింగ్, హెచ్‌ఆర్‌ఎం, ఆపరేషన్స్‌ స్పెషలైజేషన్‌లు నిర్వహిస్తున్నామని వివరించారు. మరిన్ని వివరాలకు కోఆర్డినేటర్‌ ఎంఎస్‌ శంకర్‌ (మొబైల్‌ 89711  99907, 81978 60924)ను సంప్రదించాలని కోరారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement