ఆరు నెలల క్రితమే వివాహం... | Married died in koyyalagudem | Sakshi
Sakshi News home page

ఆరు నెలల క్రితమే వివాహం...

Apr 6 2016 12:26 AM | Updated on Sep 3 2017 9:16 PM

ఆరు నెలల క్రితమే వివాహం...

ఆరు నెలల క్రితమే వివాహం...

మండలంలోని కన్నాపురం దళితవాడకు చెందిన ఓ వివాహిత అనుమానాస్పదస్థితిలో మృతిచెందింది.

కొయ్యలగూడెం : మండలంలోని కన్నాపురం దళితవాడకు చెందిన ఓ వివాహిత అనుమానాస్పదస్థితిలో మృతిచెందింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. జంగారెడ్డిగూడెం మండలం పేరంపేటకు చెందిన యడ్లపల్లి నాగలక్ష్మి(18)ని కన్నాపురానికి చెందిన గోపి అనే వ్యక్తికి ఇచ్చి ఆరు నెలల క్రితం వివాహం చేశారు. మూడు నెలల క్రితం నాగలక్ష్మికి గర్భస్రావం జరిగింది. దీనిపై గోపి తల్లీదండ్రులు, కుటుంబసభ్యులతో నాగలక్ష్మికి తరచూ గొడవ చోటు చేసుకునేది.

ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి 8 గంటల సమయంలో నాగలక్ష్మి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుందని మృతురాలి తండ్రి దుర్గయ్యకు గోపి కుటుంబ సభ్యులు ఫోన్లో సమాచారం అందించారు. అయితే తన కుమార్తె మృతి వెనుక అనుమానాలు ఉన్నాయని, అత్తమామలు, భర్త గోపి నాగలక్ష్మి మృతికి కారణమని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో దుర్గయ్య పేర్కొన్నాడు. మంగళవారం ఉదయం సీఐ బాలరాజు, ఎసై్స పి.చెన్నారావులు మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టంకు పంపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement