పట్టిసీమ, భోగాపురంపై ఎన్నో సందేహాలు: పురందేశ్వరి | many doughts on pattiseema and bhogapuram projects, says purandeswari | Sakshi
Sakshi News home page

పట్టిసీమ, భోగాపురంపై ఎన్నో సందేహాలు: పురందేశ్వరి

Oct 7 2015 9:27 AM | Updated on Mar 29 2019 9:31 PM

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పట్టిసీమ, భోగాపురం ప్రాజెక్టులపై తమకు అనుమానాలున్నాయని బీజేపీ మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి వెల్లడించారు.

అద్దంకి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన పట్టిసీమ, భోగాపురం ప్రాజెక్టులపై తమకు అనుమానాలున్నాయని బీజేపీ మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి వెల్లడించారు. ప్రకాశం జిల్లా అద్దంకికి మంగళవారం వచ్చిన పురందేశ్వరి విలేకరులతో మాట్లాడారు. ఆయా ప్రాజెక్టులపై మిత్రపక్షమైన తమకు కలిగిన అనుమానాలను తీర్చాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని ఆమె స్పష్టం చేశారు. 

రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకపోయినా.. దానికి సమానమైన అవకాశాలు కల్పించడానికి కేంద్రం చూస్తోందని వ్యాఖ్యానించారు. రాష్ట్ర నూతన రాజధానికి కేంద్రం నిధులు ఇవ్వనుందా.. అనే దానికి రాజధాని మాస్టర్ ప్లాన్, డిస్ట్రిబ్యూటరీ ప్రాజెక్టు రిపోర్టు ఇంత వరకూ పంపకపోతే ఎలా కేటాయిస్తుందని ప్రశ్నించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement