మండలంలోని నవాబుకోటకు చెందిన ఉప్పలపాటి ఆశోక్ (22) అనే యువకుడు శనివారం రాత్రి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
ఓడీ చెరువు : మండలంలోని నవాబుకోటకు చెందిన ఉప్పలపాటి ఆశోక్ (22) అనే యువకుడు శనివారం రాత్రి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్‌ఐ సత్యనారాయణ తెలిపిన వివరాల మేరకు.. కొంతకాలంగా అతడు అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఆస్పత్రుల చుట్టూ తిరిగినా నయం కాకపోవడంతో మస్తాపానికి గురై ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చిన్న వయసులోనే తల్లిదండ్రులు చనిపోవడంతో నానమ్మ వెంకటరమణమ్మ వద్ద పెరిగాడు. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కదిరికి తరలించామని ఎస్‌ఐ తెలిపారు.