నంద్యాలలో వ్యాపారి ఆత్మహత్య | man suicide in nandyal | Sakshi
Sakshi News home page

నంద్యాలలో వ్యాపారి ఆత్మహత్య

Aug 6 2016 1:15 PM | Updated on Nov 6 2018 7:56 PM

కర్నూలు జిల్లా నంద్యాల బైపాస్‌ రోడ్డులోని వంతెనకు ఓ వ్యాపారి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

నంద్యాల : కర్నూలు జిల్లా నంద్యాల బైపాస్‌ రోడ్డులోని వంతెనకు ఓ వ్యాపారి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల కథనం ప్రకారం.. పట్టణానికి చెందిన ఖాదర్ బాషా ధాన్యం వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. గత ఖరీఫ్‌ కాలంలో రాయపాలపురం గ్రామానికి చెందిన రైతుల నుంచి దాదాపు ఖాదర్ బాషా నాలుగు వేల బస్తాల ధాన్యం కొనుగోలు చేశాడు.

వాటిని సిరివెళ్లలోని గోదాములో నిల్వ ఉంచాడు. అయితే ప్రస్తుతం ధాన్యంకు గిట్టుబాటు ధర లేకపోవటంతో ధాన్యం విక్రయించ లేకపోయాడు. రైతుల నుంచి తీవ్ర ఒత్తిడి రావటంతో తట్టుకోలేక శుక్రవారం రాత్రి వంతెన కింది ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement