పిడుగుపాటుకు వ్యక్తి మృతి.. | Man killed by lightning | Sakshi
Sakshi News home page

పిడుగుపాటుకు వ్యక్తి మృతి..

Published Sun, May 29 2016 12:57 PM | Last Updated on Mon, Sep 4 2017 1:12 AM

Man killed by lightning

-ఇద్దరికి తీవ్ర గాయాలు
గట్టు

కర్ణాటక రాష్ట్రంలో పిడుగుపాటుకు గురై మహబూబ్‌నగర్ జిల్లా గట్టు మండలానికి చెందిన గొర్రెల కాపరి ప్రాణాలు కోల్పోయాడు. చింతలకుంట గ్రామానికి చెందిన కొందరు గొర్రెల పెంపకం దారులు స్థానికంగా పశుగ్రాసానికి కొరత ఏర్పడడంతో రెండు నెలల క్రితం కర్ణాటకకు వలస వెళ్లారు. వర్షాలు ప్రారంభం అవుతుండడంతో శనివారం స్వగ్రామానికి తిరిగి వస్తున్నారు. ఈ క్రమంలో రాత్రి రాయచూర్ సమీపంలోని గోనారం వద్ద ఆగారు. ఆ సమయంలో పిడుగు పడడంతో కుర్వ వీరన్న (30) మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని రాయచోటి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

 

Advertisement
 
Advertisement
 
Advertisement