చీకట్లు నింపిన విద్యుత్‌ | man dies of vidyut shock | Sakshi
Sakshi News home page

చీకట్లు నింపిన విద్యుత్‌

Apr 16 2017 11:14 PM | Updated on Sep 5 2017 8:56 AM

కణేకల్లులోని కొత్త కొట్టాలలో ఆదివారం సాయంత్రం విద్యుదాఘతానికి గురై దాసరి గొల్ల ఎర్రిస్వామి(39) మృతి చెందినట్లు ఎస్‌ఐ యువరాజు తెలిపారు.

కణేకల్లు(రాయదుర్గం) : కణేకల్లులోని కొత్త కొట్టాలలో ఆదివారం సాయంత్రం విద్యుదాఘతానికి గురై దాసరి గొల్ల ఎర్రిస్వామి(39) మృతి చెందినట్లు ఎస్‌ఐ యువరాజు తెలిపారు. కొత్త నిర్మిస్తున్న ఇంటికి వాటర్‌ క్యూరింగ్‌ చేశారు. సాయంత్రం కాగానే ఇంట్లో లైట్‌ వెలిగించేందుకు వైర్‌ను బోర్డులో అమర్చుతుండగా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడన్నారు. చుట్టుపక్కల వారు గమనించి వెంటనే అతన్ని కణేకల్లు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు అప్పటికే అతను మరణించినట్లు నిర్ధరించారన్నారు. మృతుడి భార్య నాగవేణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement