కర్షకులను కాటేసిన కరెంట్‌ | farmer dies of vidyut shock | Sakshi
Sakshi News home page

కర్షకులను కాటేసిన కరెంట్‌

Sep 13 2017 12:09 AM | Updated on Oct 1 2018 4:01 PM

కర్షకులను కాటేసిన కరెంట్‌ - Sakshi

కర్షకులను కాటేసిన కరెంట్‌

మండలంలోని చంద్రాశ్చర్లలో రైతు సాకే రామచంద్ర (45) విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. వివరాలిలా ఉన్నాయి.

కనగానపల్లి: మండలంలోని చంద్రాశ్చర్లలో రైతు సాకే రామచంద్ర (45) విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. వివరాలిలా ఉన్నాయి. రామచంద్రకు గ్రామ సమీపంలోని ఆరు ఎకరాల పొలం ఉంది. అందులో టమాట సాగుచేశాడు. మంగళవారం తెల్లవారుజామున పంటకు నీరు పెట్టడానికి వెళ్లాడు. ఆ సమయంలో విద్యుత్‌ మోటరు ఆడకపోవడంతో స్టార్టర్‌ పెట్టెలో ఉన్న ఫ్యూజులను పరిశీలించేందుకు ప్రయత్నిస్తుండగా విద్యుదాఘాతానికి గురయ్యాడు. చుట్టు పక్కల ఎవరూ లేకపోవడంతో ఆయన అక్కడే ప్రాణం వదిలాడు. ఉదయం పొలం వద్దకు వెళ్లిన కుటుంబ సభ్యులు విగత జీవిగా పడిగున్న రామచంద్రను చూసి హతాశులయ్యారు. పోలీసులు, విద్యుత్‌ అధికారులు సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement