కరెంట్‌షాక్‌తో కౌలు రైతు | farmer dies of vidyut shock | Sakshi
Sakshi News home page

కరెంట్‌షాక్‌తో కౌలు రైతు

Sep 15 2017 10:29 PM | Updated on Oct 1 2018 4:01 PM

కణేకల్లుకు చెందిన కౌలురైతు ఆంజనేయులు (50) శుక్రవారం విద్యుదాఘాతంతో మృతి చెందాడు.

కణేకల్లు: కణేకల్లుకు చెందిన కౌలురైతు ఆంజనేయులు (50) శుక్రవారం విద్యుదాఘాతంతో మృతి చెందాడు. స్థానికులు, పోలీసుల కథనం మేరకు... ఆంజనేయులు ఆలూరు వద్ద 5ఎకరాల భూమిని కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నాడు. పొలంలో వరిసాగు చేసేందుకు వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యాడు. శుక్రవారం ఉదయం పొలానికి నీళ్లు పెట్టి మాగాణికి దమ్ము చేయించాలనుకున్నాడు. స్టార్టర్‌ ఆన్‌ చేయగానే విద్యుత్‌షాక్‌కు గురై సృహ కోల్పోయాడు. పక్కనే ఉన్న రైతులు గమనించి వెంటనే ఆర్డీటీ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆంజనేయులు మృతి చెందాడు. భార్య అనంతమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ యువరాజు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement