ఆటోను ఢీకొట్టిన లారీ.. వ్యక్తి మృతి | man dies in auto-truck collision in visakapatnam | Sakshi
Sakshi News home page

ఆటోను ఢీకొట్టిన లారీ.. వ్యక్తి మృతి

Nov 5 2016 10:00 AM | Updated on Mar 9 2019 4:29 PM

ఎదురెదురుగా వస్తున్న రెండు వాహనాలు ఒకదానితో ఒకటి ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతిచెందగా.. మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి.

అనకాపల్లి(విశాఖపట్నం): ఎదురెదురుగా వస్తున్న రెండు వాహనాలు ఒకదానితో ఒకటి ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతిచెందగా.. మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన విశాఖపట్నం జిల్లా అనకాపల్లి జాతీయరహదారిపై కొప్పాడ వద్ద శుక్రవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది.

వేగంగా వెళ్తున్న లారీ ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొట్టింది. దీంతో ఆటోలో ఉన్న రమణ(45) అక్కడికక్కడే మృతిచెందగా.. మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన పోలీసులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement