భార్య పుట్టింటికి వెళ్లిందని.. | man committed suicide with family disputes | Sakshi
Sakshi News home page

భార్య పుట్టింటికి వెళ్లిందని..

Jun 6 2016 12:04 PM | Updated on Nov 6 2018 7:56 PM

కుటుంబ కలహాల నేపథ్యంలో భార్య పుట్టింటికి వెళ్లడంతో.. మనస్తాపానికి గురైన యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.

శంషాబాద్(రంగారెడ్డి): కుటుంబ కలహాల నేపథ్యంలో భార్య పుట్టింటికి వెళ్లడంతో.. మనస్తాపానికి గురైన యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం ముచ్చింతల్ గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మనోహర్(25)కు రెండేళ్ల క్రితం వివాహమైంది. ఈ క్రమంలో గత కొన్ని రోజులుగా భార్యా భర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. మనోహర్‌తో గొడవపడిన భార్య పుట్టింటికి వెళ్లింది. దీంతో మనస్తాపానికి గురైన మనోహర్ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement