మండల కేంద్రంలో రైల్వే స్టేషన్ పరిదిలో గుర్తు తెలియని వ్యక్తి మృత దేహాన్ని కనుగొన్నారు
నిజామాబాద్ :
మండల కేంద్రంలో రైల్వే స్టేషన్ పరిధిలో గుర్తు తెలియని వ్యక్తి మృత దేహాన్ని కనుగొన్నారు. స్థానిక ఎస్సై రాజశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం బుధవారం ఉదయం గుర్తు తెలియని వ్యక్తి చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు సమాచారం అందించడంతో అక్కడకు వెళ్లి పరిశీలించారు.
అయితే ఆ సంఘటనకు సంబంధించి ఎటువంటి ఆధారాలు లభ్యం కాలేదన్నారు. వీఆర్వో అశోక్ ఆధ్వర్యంలో శవానికి పంచనామా నిర్వహించి ఆ తర్వాత జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.