మల్లన్న సాగర్‌ కట్టితీరుతాం | Mallanna Sagar kattitirutam | Sakshi
Sakshi News home page

మల్లన్న సాగర్‌ కట్టితీరుతాం

Jul 24 2016 8:51 PM | Updated on Sep 4 2017 6:04 AM

మల్లన్న సాగర్‌ కట్టితీరుతాం

మల్లన్న సాగర్‌ కట్టితీరుతాం

నాడు తెలంగాణ ఉద్యమాన్ని కాంగ్రెస్, టీడీపీలు అడ్డుకున్నాయని.. అయినా ప్రజల సంఘటితంతో రాష్ట్రాన్ని సాధించామని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు

- రైతులను తప్పుదోవ పట్టిస్తున్న ప్రతిపక్షాలు
- అడ్డుకుంటే ప్రజలే గుణపాఠం చెబుతారు
- రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు

చిన్నకోడూరు: నాడు తెలంగాణ ఉద్యమాన్ని కాంగ్రెస్, టీడీపీలు అడ్డుకున్నాయని.. అయినా ప్రజల సంఘటితంతో రాష్ట్రాన్ని సాధించామని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. నేడు రైతుల మేలు కోసం ప్రాజెక్టులకు పూనుకుంటే కాంగ్రెస్, టీడీపీలు అడ్డుకుంటున్నాయని.. ఎన్ని అడ్డంకులు ఎదురైనా మల్లన్న సాగర్‌ ప్రాజెక్టును నిర్మిస్తామని  స్పష్టం చేశారు.

 

ఆదివారం మండలంలోని పలు గ్రామాల్లో అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌ మాట్లాడుతూ.. మన బతుకు దెరువు చూపేది మల్లన్న సాగర్‌ అన్నారు. ఆత్మహత్యలు లేని ఆకుపచ్చ మెతుకు సీమను తయారు చేసిది మల్లన్న సాగరేనని ఆయన చెప్పారు. ఈ విషయంలో కాంగ్రెస్, టీడీపీలు ప్రాజెక్టును అడ్డుకోవడానికి రైతులను తప్పుదోవ పట్టిస్తున్నాయని విమర్శించారు. మల్లన్న సాగర్‌ నిర్మాణాన్ని అడ్డుకుంటే ప్రజలే బుద్ధి చెబుతారన్నారు.



 

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement