పిచ్చి కుక్క స్వైర విహారం | Mad dog attack - two injured | Sakshi
Sakshi News home page

పిచ్చి కుక్క స్వైర విహారం

Apr 14 2016 7:42 PM | Updated on Sep 3 2017 9:55 PM

హిందూపురం పట్టణంలోని నింకంపల్లికి వెళ్ళే రహదారిలో పిచ్చికుక్క ఇద్దరు చిన్నారులను కరిచి తీవ్రంగా గాయపరిచిన సంఘటన గురువారం చోటు చేసుకుంది.

- ఇద్దరు చిన్నారులకు తీవ్ర గాయాలు

హిందూపురం (అనంతపురం
)
హిందూపురం పట్టణంలోని నింకంపల్లికి వెళ్ళే రహదారిలో పిచ్చికుక్క ఇద్దరు చిన్నారులను కరిచి తీవ్రంగా గాయపరిచిన సంఘటన గురువారం చోటు చేసుకుంది. స్థానిక పరిగి రోడ్డు సమీపంలో నింకంపల్లి రహదారిలో ఇద్దరు చిన్నారులు చంద్రశేఖర్(7), ముజాయిద్(9)లు ఇంటి వద్ద ఆడుకుంటుండగా పిచ్చికుక్క కరిచిందని స్థానికులు తెలిపారు.

 చంద్రశేఖర్‌కు చెవిని, చేతిని కరవడంతో తీవ్రగాయాలు అయ్యాయి. ముజాయిద్‌కు కాలిని కరవడంతో దీన్ని గమనించిన స్థానికులకు కుక్కను తరిమివేసి చిన్నారులను స్థానిక జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చిన్నారులకు రెబిస్ ఇంజెక్షన్లు ఇచ్చి చికిత్స అందిస్తున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement