తప్పిన పెను ప్రమాదం | lpg cilinders auto accident | Sakshi
Sakshi News home page

తప్పిన పెను ప్రమాదం

Aug 6 2016 7:54 AM | Updated on Apr 3 2019 7:53 PM

తప్పిన పెను ప్రమాదం - Sakshi

తప్పిన పెను ప్రమాదం

వంట గ్యాస్‌ సిలిండర్లను తరలిస్తున్న ఆటో బోల్తా కొట్టిన ఘటన మండల పరిధిలోని ఎర్రవాగు బ్రిడ్జి వద్ద చోటుచేసుకుంది.

పిడుగురాళ్ల టౌన్‌ (గుంటూరు) : వంట గ్యాస్‌ సిలిండర్లను తరలిస్తున్న ఆటో బోల్తా కొట్టిన ఘటన మండల పరిధిలోని ఎర్రవాగు బ్రిడ్జి వద్ద శుక్రవారం చోటుచేసుకుంది. గ్యాస్‌ గోదాము నుంచి సిలిండర్లతో ఆటో బయలుదేరి చుట్టుపక్కల గ్రామాలకు వెళుతుంది. ఈ క్రమంలో బ్రిడ్జి వద్దకు ఆటో వచ్చేసరికి గుంటూరు వైపు వెళుతున్న లారీ ఆటోని ఒక పక్కగా తగిలి ఆపకుండానే వెళ్లిపోయింది.

దీంతో ఒక్కసారిగా ఆటో బోల్లా కొట్టి సిలిండర్లన్నీ రహదారిపై పడిపోయాయి. ఈ ఘటనతో ఒక్కసారిగా వాహనదారులంతా ఎక్కడివారక్కడే ఆగిపోయి పరుగులు తీశారు. సిలిండర్లు పేలతాయోమోనని భయాందోళన చెందారు. కొద్ది సేపటి తర్వాత ఎలాంటి ప్రమాదం లేదని తెలుసుకొని ప్రమాద స్థలం వద్దకు చేరుకొని ఊపిరిపీల్చుకున్నారు. రోడ్డుపై ఉన్న సిలిండర్లన్నీ ఒక పక్కకు చేర్చారు. పెద్ద ప్రమాదం తప్పిందని అందరూ భావించారు.

Advertisement
 
Advertisement
Advertisement