మాతృభాషపై మమకారం పెంచుకోండి | loves the mother tongue says eluru ganganna | Sakshi
Sakshi News home page

మాతృభాషపై మమకారం పెంచుకోండి

Jul 29 2016 10:21 PM | Updated on Sep 4 2017 6:57 AM

మాతృభాషపై మమకారం పెంచుకోండి

మాతృభాషపై మమకారం పెంచుకోండి

ఎన్నిభాషల్లో ప్రావీణ్యం సంపాదించినా, మాతృభాషను మాత్రం మరవకూడదని జనప్రియ కవి ఏలూరు ఎంగన్న, డా.గొల్లాపిన్ని శేషాచలం యువతకు సూచించారు.

అనంతపురం కల్చరల్‌ : ఎన్నిభాషల్లో ప్రావీణ్యం సంపాదించినా, మాతృభాషను మాత్రం మరవకూడదని జనప్రియ కవి ఏలూరు ఎంగన్న, డా.గొల్లాపిన్ని శేషాచలం యువతకు సూచించారు. శుక్రవారం కనకదాస కల్యాణ మండపంలో మాస్టర్‌ మైండ్స్‌ డిగ్రీ కళాశాల ఫ్రెషర్స్‌ డే కార్యక్రమం జరిగింది. డా.సీతారామశాస్త్రి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి సాహితీవేత్తలు డా. గొల్లాపిన్ని శేషాచలం,  ఏలూరు ఎంగన్నతో పాటు ఆచార్య బసవయ్య తదితరులు ఆత్మీయ అతిథులుగా విచ్చేసి మార్గదర్శనం చేశారు.


మాతృభాషాభివృద్ధికి ప్రతి ఒక్కరూ పాటుపడాలన్నారు. ఈ సందర్భంగా అతిథులు ఆలపించిన తెలుగు పద్యాలు అందరిని అలరించాయి. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. చివరగా అతిథులను విద్యార్థులు, కళాశాల సిబ్బంది ఘనంగా సన్మానించారు.   
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement