బైక్‌లపైకి దూసుకెళ్లిన క్వారీ లారీ | lorry accident one men dead | Sakshi
Sakshi News home page

బైక్‌లపైకి దూసుకెళ్లిన క్వారీ లారీ

Oct 27 2016 11:49 PM | Updated on Sep 4 2017 6:29 PM

జాతీయ రహదారిపై ధవళేశ్వరం ఇండస్ట్రియల్‌ కాలనీ వద్ద గురువారం మధ్యాహ్నం జరిగిన ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు, పోలీసులు చెప్పిన వివరాలిలా ఉన్నాయి. ధవళేశ్వరం కొత్తపేట ప్రాంతానికి చెందిన లోట్ల అప్పలరాజు, ఇందిరా స్వర్ణనగర్‌కు చెందిన ఇమ్మంది వీరవెంకట శివరామప్రసాద్‌ (27)లు మిత్రులు. ఇద్దరూ బొమ్మూరు వచ్చి , అక్కడ పని ముగించుకుని వేర్వేరు బైక్‌లపై ఇళ్లకు వెళుతున్నారు.

ధవళేశ్వరం/రాజమహేంద్రవరం: 
జాతీయ రహదారిపై ధవళేశ్వరం ఇండస్ట్రియల్‌ కాలనీ వద్ద గురువారం మధ్యాహ్నం జరిగిన ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు, పోలీసులు చెప్పిన వివరాలిలా ఉన్నాయి. ధవళేశ్వరం కొత్తపేట ప్రాంతానికి చెందిన లోట్ల అప్పలరాజు, ఇందిరా స్వర్ణనగర్‌కు చెందిన ఇమ్మంది వీరవెంకట శివరామప్రసాద్‌ (27)లు మిత్రులు. ఇద్దరూ బొమ్మూరు వచ్చి , అక్కడ పని ముగించుకుని వేర్వేరు బైక్‌లపై ఇళ్లకు వెళుతున్నారు. ఇండస్ట్రియల్‌ కాలనీ వద్దకు వచ్చేసరికి బొమ్మూరు నుంచి వేమగిరి వైపు మట్టి లోడుతో వేగంగా వస్తున్న క్వారీ లారీ వారి బైక్‌లపైకి దూసుకువెళ్లింది. అంతటితో ఆగని లారీ ముందుకు వెళ్లి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో అప్పలరాజు తలకు బలమైన గాయాలవగా, శివరామప్రసాద్‌ కాలు నుజ్జునుజ్జయింది. ఈ ప్రమాదంలో ఇంజ¯ŒS ఆయిల్‌ మీద పడడంతో పశ్చిమ గోదావరి జిల్లా పంగిడి గ్రామానికి చెందిన లారీ డ్రైవర్‌ జవ్వాదుల దుర్గాప్రసాద్‌ కూడా తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ముగ్గురినీ తొలుత రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.  అప్పలరాజు, రామప్రసాద్‌ల పరిస్థితి ప్రమాదకరంగా ఉండడంతో మెరుగైన వైద్య కోసం నగరంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. రామ్‌ప్రసాద్‌ను అక్కడి నుంచి కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతిచెందాడు.
 
దుబాయ్‌ వెళ్లాలనుకుని ... అనంత లోకాలకు..
తండ్రి చనిపోవడంతో తల్లి, నలుగురు అక్కలున్న కుటుంబాన్ని అన్నీ తానై రామ్‌ప్రసాద్‌ పోషిస్తున్నాడు.యానాం వద్ద రిలయ¯Œ్స సంస్థలో అతడు చిరుద్యోగి. కుటుంబానికి మరింత అండగా ఉండాలనే ఉద్దేశంతో మరో నాలుగు రోజుల్లో దుబాయ్‌ వెళ్లే ప్రయత్నాల్లో ఉన్నాడు.   ఈలోగా మృత్యువాత పడడంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.                                                                                 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement