తిరుచ్చిపై శ్రీనివాసుడు చిద్విలాసం | lord venkateswara on tirchi | Sakshi
Sakshi News home page

తిరుచ్చిపై శ్రీనివాసుడు చిద్విలాసం

Sep 3 2016 11:55 PM | Updated on Sep 4 2017 12:09 PM

తిరుచ్చిపై విహరిస్తున్న శ్రీనివాసుడు

తిరుచ్చిపై విహరిస్తున్న శ్రీనివాసుడు

శ్రీనివాస మంగాపురంలో వెలసిన శ్రీకల్యాణ వెంకటేశ్వర స్వామి వారు శనివారం తిరుచ్చి వాహనంపై నాలుగు మాడ వీధులలో విహరించారు. వారపు ఉత్సవాలలో భాగంగా ఉదయం స్వామివారిని సుప్రభాతసేవతో మేల్కొలిపారు. శ్రీనివాస మంగాపురం, వెంకటేశ్వర స్వామి,శనివారం

 
శ్రీనివాస మంగాపురం(చంద్రగిరి): శ్రీనివాస మంగాపురంలో వెలసిన శ్రీకల్యాణ వెంకటేశ్వర స్వామి వారు శనివారం తిరుచ్చి వాహనంపై నాలుగు మాడ వీధులలో విహరించారు. వారపు ఉత్సవాలలో భాగంగా ఉదయం స్వామివారిని సుప్రభాతసేవతో మేల్కొలిపారు. అనంతరం స్వామివారికి ఫల, పుష్ప సుగంధ పన్నీటి ద్రవ్యాలతో అభిషేక సేవ నిర్వహించారు. స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను  కల్యాణమండంపంలోకి వేంచేపు చేసి, వైఖానస ఆగమోక్తంగా కన్నుల పండువగా కల్యాణోత్సవాన్ని నిర్వహించారు. సాయంత్రం స్వామి, అమ్మవార్లు తిరుచ్చి వాహనంపై ఆశీనులై నాలుగుమాడ వీధులలో ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. ఈసందర్భంగా భక్తులు దేవేరులకు ధూపదీప నైవేద్యాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ  ఏఈవో ధనుంజయ, ఇన్‌స్పెక్టర్లు దినకర రాజు, కష్ణారావు తదితరులు పాల్గొన్నారు. 
 
 

Advertisement
 
Advertisement
Advertisement