తితిదేకి అనుబంధంగా ఉన్న రిషికేష్ ఆంధ్ర ఆశ్రమంలోని శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో మే 19 నుండి 27వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగనున్నాయి.
తిరుపతి: తితిదేకి అనుబంధంగా ఉన్న రిషికేష్ ఆంధ్ర ఆశ్రమంలోని శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో మే 19 నుండి 27వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగనున్నాయి. ఈ ఉత్సవాల సందర్భంగా మే 17వ తేదీన కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరుగనుంది. మే 18వ తేదీ సాయంత్రం అంకురార్పణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభంకానున్నాయి.
ప్రతిరోజూ ఉదయం 7.30 నుంచి 9.00 గంటల వరకు, రాత్రి 7.00 నుంచి 8.30 గంటల వరకు వాహనసేవలు జరుగనున్నాయి. ఈ సందర్భంగా తితిదే హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టు, దాససాహిత్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజూ ఆధ్యాత్మిక, భక్తి సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు, భజనలు, కోలాటాలు నిర్వహించనున్నారు.