
లోక్‌సత్తా పార్టీ రద్దు కాలేదు
రానున్న ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయరాదని మాత్రమే లోక్‌సత్తా పార్టీ కేంద్ర నాయకత్వం నిర్ణయం తీసుకుందని, దీని అర్ధం పార్టీ రద్దయినట్టు కాదని లోక్‌సత్తా ఉద్యమ సంస్థ రాష్ట్ర కన్వీనర్ బండారులంక రామ్మోహనరావు తెలిపారు.
శనివారం స్థానిక పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇకపై లోక్‌సత్తా ఉద్యమ సంస్థ ద్వారా పార్టీ భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకువెళతామని పేర్కొన్నారు. పార్టీ అంశాలపై వివిధ ప్రాంతాల్లో విస్తృత ప్రచారం చేస్తామని వివరించారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు ఎంవీ రాజగోపాల్, ఎన్‌ఎస్ రామచంద్రమూర్తి, బి.శ్రీనివాస్, సీఎస్ కామేశ్వరరావు, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.